నెక్స్ట్ షెడ్యూల్ కి సిద్దమైన ప్రభాస్ – మారుతీ మూవీ ?

నెక్స్ట్ షెడ్యూల్ కి సిద్దమైన ప్రభాస్ – మారుతీ మూవీ ?

Published on Dec 7, 2022 11:03 PM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో ప్రస్తుతం ఒక ప్రతిష్టాత్మక భారీ కమర్షియల్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా, ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ అదిరిపోవడంతో పాటు మూవీ ఆద్యంతం ఆయన ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఏకట్టుకునేలా దర్శకడు మారుతీ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

అయితే విషయం ఏమిటంటే, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోన్న ఈ భారీ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ రేపటి నుండి జరుగనుందట. ప్రభాస్ కి జోడీగా ముగ్గురు యంగ్ హీరోయిన్స్ కనిపించనున్న ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు యూనిట్ పక్కాగా ప్లాన్స్ సిద్ధం చేస్తున్నట్లు చెప్తున్నారు. కాగా అతి త్వరలో ఈ మూవీ గురించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు