“ప్రాజెక్ట్ కే” కోసం 200 రోజుల పాటు డేట్లను ఇచ్చిన ప్రభాస్..!

Published on Sep 21, 2021 2:38 am IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ఇప్పటికే ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని పూర్తి చేయగా ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’, ఆ తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాలు విడుదల కానున్నాయి. వీటి తర్వాత ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని నాగ్ అశ్విన్‌తో ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. “ప్రాజెక్ట్ కే” పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తుండగా, అమితాబచ్చన్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.

అయితే ఈ సినిమాకి సంబంధించి ఈ మధ్యనే ఒక పది రోజుల పాటు సాగిన షూటింగ్ తాజాగా పూర్తయింది. ఇందులో అమితాబచ్చన్‌కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి స్టార్ట్ కాబోతుందట. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ రెండు వందల రోజుల పాటు డేట్లను ఇచ్చాడు. ఈ సినిమా షూటింగు పూర్తవడానికి 12 నుంచి 13 నెలలు పట్టనున్నట్టు సమాచారం.

సంబంధిత సమాచారం :