ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్..సైలెంట్ గా..!

ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్..సైలెంట్ గా..!

Published on Oct 27, 2022 10:01 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వీటిలో భారీ చిత్రం ఆదిపురుష్ ఆల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉండగా సలార్ సహా ప్రాజెక్ట్ కే చిత్రాలు షూటింగ్ లో ఉన్నాయి. ఇక వీటితో పాటుగా ప్రభాస్ అయితే ఓ క్విక్ ప్రాజెక్ట్ గా దారుస్సకుడ్ మారుతీ తో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని ప్రభాస్ రీసెంట్ గానే స్టార్ట్ చేయగా దీనిపై ఇప్పుడు ఓ లేటెస్ట్ న్యూస్ అయితే తెలుస్తుంది.

ఈ చిత్రం రెగ్యూలర్ షూట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యిపోయిందట. అంతే కాకుండా ఈ షూటింగ్ లో ప్రభాస్ కూడా పాల్గొని తన షూట్ ని సైలెంట్ గా కానిచేస్తున్నాడట. దీనితో అయితే ఈ షూట్ ని ప్రభాస్ సైలెంట్ గా చేసేస్తున్నాడని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో అయితే ఫీమేల్ లీడ్ లో మాళవిక మోహనన్ నటిస్తుండగా దర్శకుడు మారుతీ ఈ చిత్రాన్ని ఓ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు