ఆ విషయంలో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదు… !

Published on Aug 26, 2019 7:13 am IST

కేవలం 4రోజుల్లో సాహో విడుదల నేపథ్యంలో ప్రభాస్ ప్రచారంలో బిజీగా ఉన్నారు. వివిధ టీవీ కార్యక్రమాలలో పాల్గొంటూ, వివిధ భాషల మీడియా ప్రతినిధులతో సమావేశం అవుతూ, ప్రభాస్ అన్నీ తానై ప్రచారం నిర్వహిస్తున్నారు. ఐతే అదే స్థాయిలో దేశవ్యాప్తంగా సాహోకి భారీ హైప్ క్రియేట్ కావడం గమనార్హం.

ఇక ఇటీవల పాత్రికేయుల సమావేశం లో పాల్గొన్న ప్రభాస్ మీ తదుపరి చిత్రం కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందా అన్న ప్రశ్నకు, ఇకపై నేను భారీ చిత్రాలలో నటించను అని షాకింగ్ న్యూస్ చెప్పారు. భారీ బడ్జెట్ చిత్రాల వలన ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నానన్న ప్రభాస్ కొంత కాలం వరకు భారీ చిత్రాల జోలికి వెళ్లనన్నారు. ఈ వార్త ప్రభాస్ నుండి భారీ తరహా చిత్రాలు ఆశించే వారికి నిరాశ కలిగించే విషయమే అనడంలో సందేహం లేదు.

ఐతే డార్లింగ్ ఇకపై ఏడాదికి రెండు చిత్రాలకు తగ్గకుండా చేస్తాను అని చెప్పడం ఉపశమనం కలిగించే అంశం.

సంబంధిత సమాచారం :