ప్రభాస్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఆరంభం నేడే.!

Published on Jul 24, 2021 9:37 am IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఇండియన్ బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో మరో బడా నటుడు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు.

జస్ట్ క్యాస్టింగ్ తోనే భారీ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం ఎప్పుడు మొదలు అవుతుందా ఇతర అంశాలపై మేకర్స్ ఎప్పుడూ ఆసక్తికర అప్డేట్స్ నే ఇస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం ఈరోజే షూట్ ను ప్రారంభించుకోనుండడం హాట్ టాపిక్ గా మారింది. పైగా ఈ రోజు నుంచే బిగ్ బి కూడా పాల్గొననున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.

ఈరోజే ఒక ఫార్మల్ పూజా కార్యక్రమంతో మొదలై తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని మేకర్స్ భారీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ వారు 500 కోట్లకు పైగా భారీ వ్యయంతో పాన్ వరల్డ్ మూవీగా ఇండియా నుంచి తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :