జాన్ షెడ్యూల్ ముగిసింది.. ప్రభాస్ – పూజాల కెమిస్ట్రీ హైలైట్ !

Published on Jan 26, 2020 2:25 pm IST

రెబల్ స్టార్ ప్రభాస్ లాంగ్ గ్యాప్ తర్వాత జాన్ షూటింగ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ చిత్రం మూడవ షెడ్యూల్ నిన్న ముగిసింది. ఈ షెడ్యూల్ అవుట్‌ పుట్ చాల బాగా వచ్చిందని యూనిట్ మొత్తం చాలా సంతోషంగా ఉంది. కాగా వైవిధ్యమైన ప్రేమకథతో రాబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ – పూజా హెగ్డే పాత్రల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని.. మొత్తం సినిమాలోనే వీరి కెమిస్ట్రీ ప్రధాన హైలైట్ కాబోతుందని దర్శకుడు రాధాకృష్ణ పేర్కొన్నారు.

కాగా మరో షెడ్యూల్ కోసం ఫిబ్రవరిలో ఆస్ట్రియాకు వెళ్లనుంది టీం. ముఖ్యమైన సన్నివేశాలతో పాటు పాటలను కూడా ఆస్ట్రియా షెడ్యూల్ షూట్ చేయనున్నారు. ఇక హైదరాబాద్ లో వేసిన సెట్ ను చాలా ప్రత్యేకతలతో ఎంతో కష్టపడి నిర్మించారు. మొర్రాకో టైల్స్ తో వేసిన ఫ్లోరింగ్, యాంటిక్ పియానో, ఖరీదైన కార్పెట్స్ ఇలా సెట్ కోసం వాడిన ప్రాపర్టీస్ అన్నీ లావిష్ అండ్ కాస్ట్లీ అట. మొత్తంగా ఒక్క సెట్ కోసం రూ.3 కోట్లు వెచ్చించారు.

గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదిస్తారట.

సంబంధిత సమాచారం :

X
More