డోంట్ మిస్.. ప్రభాస్ ప్రాజెక్ట్-కె లో నటించే ఆఫర్..!

Published on Apr 1, 2022 10:34 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’ వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో ప్రభాస్‌తో నటించే అవకాశాన్ని మేకర్స్ కల్పించారు. ప్రాజెక్ట్ కె క్యాస్టింగ్ కాల్ కి పిలుపునిచ్చారు. ఫేసెస్ ఆఫ్ ది ఫ్యూచర్ అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో ఏప్రిల్ 3, 4 తేదీలలో జరగనున్నది. వయస్సు, లింగ బేధం, భాష, ఇలాంటి బేధాలు ఏమి లేవని టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులే అని మేకర్స్ తెలిపారు. త్వరలోనే కార్యక్రమాన్ని నిర్వహించే వేదికను వెల్లడిస్తామని తెలిపారు. మరీ ఇంకెందుకు ఇంకెందుకు ఆలస్యం మీలో మంచి నటన ఉంటే ఈ అవకాశాన్ని వాడుకుని ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేయండి.

సంబంధిత సమాచారం :