మాసివ్..”ప్రాజెక్ట్ కే” నుంచి గూజ్ బంప్స్ తెప్పిస్తున్న క్రేజీ పోస్టర్.!

మాసివ్..”ప్రాజెక్ట్ కే” నుంచి గూజ్ బంప్స్ తెప్పిస్తున్న క్రేజీ పోస్టర్.!

Published on Oct 23, 2022 1:02 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా చేస్తున్న చిత్రం “ప్రాజెక్ట్ కే” కూడా ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఇదిలా ఉండగా ఈ భారీ చిత్రం నుంచి ఈరోజు ప్రభాస్ బర్త్ డే కానుకగా ఈ అవైటెడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ ఇప్పుడు ఓ ఊహించని బిగ్ అప్డేట్ ని అయితే అందించారు.

మరి నిన్న దర్శకుడు చెప్పిన ఆ స్మాల్ సర్ప్రైజ్ అయితే ఇప్పుడు గూజ్ బంప్స్ తెప్పించే లెవెల్లో ఉందని చెప్పాలి. మరి ఈ పోస్టర్ లో ప్రభాస్ చేస్తున్న పాత్ర తాలూకా చేతిని చూపిస్తూ దాని చుట్టూతా ఉన్న కవచం తో ఆ విజువల్ మైండ్ బ్లాకింగ్ హా కనిపిస్తుంది. దీనితో ఈ పోస్టర్ తో ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. అలాగే ఇందులో హీరోలు ఎవరు పుట్టరు వాళ్ళు రైజ్ అవుతారు అని ట్యాగ్ కూడా ఆసక్తిగా ఉంది. మరి ఈ మాసివ్ పోస్టర్ అయితే ఊహాతీతంగా ఉంది. మరి దర్శకుడు నాగశ్విన్ అయితే ఏం చూపిస్తాడా అని అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు