వైరల్: తనకి ‘సలార్’ ఎవరో చెప్తున్న రెబల్ స్టార్!

వైరల్: తనకి ‘సలార్’ ఎవరో చెప్తున్న రెబల్ స్టార్!

Published on Jun 4, 2025 6:01 PM IST

salaaar

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసిన పలు ఐకానిక్ చిత్రాల్లో “సలార్” కూడా ఒకటి. సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ప్రభాస్ కెరీర్లో మరో సాలిడ్ హిట్ గా నిలవగా ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన వరద రాజమన్నార్ పాత్రకి సలార్ గా కనిపిస్తాడని తెలిసిందే.

అయితే మరి తనకి సలార్ ఎవరో ప్రభాస్ ఇపుడు చెబుతున్నాడు. మరి తన సలార్ ఎవరో కాదట. తన దర్శకుడు ప్రశాంత్ నీల్ నే తన సలార్ అంటూ నేడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక విషెస్ ని తాను సోషల్ మీడియాలో చెప్పడం వైరల్ గా మారింది. నీ మ్యాడ్నెస్ ని పార్ట్ 2 లో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ సలార్ 2 పై కూడా పెట్టిన క్యాప్షన్ ఇపుడు రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని ఓ రేంజ్ లో ఎగ్జైట్ చేస్తుంది.

Salaar2 Neel

తాజా వార్తలు