“ఆదిపురుష్”కి కాస్త ముందే స్టార్ చేసిన ప్రభాస్.?

Published on Aug 17, 2021 10:00 am IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ భారీ పాన్ ఇండియన్ సినిమాల్లో దర్శకుడు ఓంరౌత్ తో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. మన దేశంలోనే అత్యధిక విజువల్ ఎఫెక్ట్స్ కలిగిన చిత్రంగా ప్రస్తుతం దీనిని మేకర్స్ తీర్చిదిద్దుతున్నారు.

మరి అలాగే ఈ చిత్రాన్ని ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ రాముని పాత్రలో నటిస్తున్నాడు. మరి ఇదిలా ఉండగా ప్రభాస్ మళ్ళీ తన షూటింగ్స్ అన్నీ మొదలు పెట్టాక ఒక ప్లానింగ్ లో ఒక్కో సినిమాని కంప్లీట్ చేస్తూ వస్తుండగా ఆదిపురుష్ ని వచ్చే సెప్టెంబర్ నెల నుంచి స్టార్ట్ చేస్తాడని తెలిసింది.

కానీ లేటెస్ట్ గా ఆల్రెడీ ప్రభాస్ ఈ సినిమా షూట్ నిమిత్తం ముంబై వెళ్లినట్టు తెలుస్తుంది. దీనితో ఈ చిత్రం షూట్ ని కాస్త ముందే స్టార్ట్ చేసినట్టే అని చెప్పాలి. అయితే నిన్న సైఫ్ బర్త్ డే సందర్భంగా ప్రభాస్ పెట్టిన ట్వీట్ కూడా మంచి వైరల్ అయ్యింది. సైఫ్ ఈ చిత్రంలో రావణ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :