“శ్రీదేవి సోడా సెంటర్”కు ప్రభాస్ సపోర్ట్..!

Published on Aug 25, 2021 1:50 am IST

టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదల కాబోతుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇప్పటికే అగ్ర కథానాయకులు ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాలుపంచుకోగా తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమాకి మంచి సపోర్ట్ ఇస్తున్నాడు.

అయితే ఈ సినిమా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్‌ను ప్రభాస్ ఇంటర్వ్యూ చేస్తూ వారి నుంచి సినిమాకి సంబంధించిన విషయాలను రాబట్టుకున్నాడు. ఈ ఇంటర్వ్యూ వీడియో బుధవారం రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఈ సినిమాకు మంచి ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది.

సంబంధిత సమాచారం :