ప్రభాస్ చేతుల మీదుగా మెగా హీరో పాట విడుదల !

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘ఇంటిలిజెంట్’. ఫిబ్రవరి 9వ తేదీన సినిమా విడుదలకానుండటంతో చిత్ర టీమ్ ప్రమోషన్ల వేగం పెంచింది. నిన్న సీనియర్ స్టార్ హీరో బాలక్రిష్ణ చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేసిన చిత్ర యూనిట్ ఈరోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఆడియోలో మొదటి పాటను రిలీజ్ చేయించనుంది.

ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రభాస్ పాటను విడుదలచేయనున్నారు. వివి. వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పూర్తిస్థాయి కమర్షియర్ల ఎంటర్టైనర్ గా ఉండనుంది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తుండగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది.