“రాధే శ్యామ్” తో ప్రభాస్ కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తాడట.!

Published on May 4, 2021 7:00 pm IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ భారీ చిత్రం ఒక పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మేకర్స్ ప్లాన్ చేసిన ఈ వింటేజ్ లవ్ స్టోరీపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి.

అయితే ప్రభాస్ నుంచి ఒక సరైన లవ్ స్టోరీ వచ్చి చాలా కాలమే అయ్యింది ఆ లెక్కన కూడా రాధే శ్యామ్ పై మంచి అంచనాలు ఎప్పటి నుంచో నెలకొన్నాయి. మరి అలా ప్రభాస్ నుంచి ఒక పర్ఫెక్ట్ లవ్ స్టోరీ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ రాధే శ్యామ్ ఒక చక్కటి సమాధానం ఇవ్వనుంది అని తెలుస్తుంది.

తాజా సమాచారం ప్రకారం దాదాపు దశాబ్ద కాలం తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న ఈ లవ్ స్టోరీ ప్రభాస్ కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన బెస్ట్ లవ్ అండ్ రొమాంటిక్ సినిమాగా నిలుస్తుందని అంతే కాకుండా ఒకప్పటి లవర్ బాయ్ గా ప్రభాస్ తన మార్క్ తో చెరగని ముద్ర వేస్తాడని సినీ వర్గాల్లో టాక్. మరి రాధే శ్యామ్ తో ప్రభాస్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :