టాక్..”సలార్” లో ప్రభాస్ అప్పుడు జాయిన్ అవుతాడట.!

Published on Dec 31, 2021 7:03 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమాల్లో తన కెరీర్ లోనే మరో బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాలా వస్తున్న సినిమా మాత్రం “సలార్”. “కేజీయఫ్” ఫేమ్ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం కొంత మేర షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు బ్రేక్ లో ఉంది. అయితే ఈ సినిమాపై ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఒకటి వినిపిస్తుంది.

ప్రస్తుతం ప్రభాస్ తన ఆల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉన్న మోస్ట్ అవైటెడ్ సినిమా “రాధే శ్యామ్” రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. మరి ఈ ప్రమోషన్స్ అన్నీ అయ్యి వచ్చే జనవరి 14న సినిమా రిలీజ్ అయ్యాకనే సలార్ షూటింగ్ లో పాల్గొనాలని ప్లాన్ చేస్తున్నాడట. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాకి ఆల్ మోస్ట్ కేజీయఫ్ టెక్నీషియన్లే వర్క్ చేస్తుండగా వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :