ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !

Published on Dec 16, 2018 11:32 am IST

ఈ ఏడాది ప్రభాస్ నటిస్తున్న సినిమా ఒక్కటి కూడా విడుదల కావడం లేదని నిరాశలో వున్న అయన అభిమానులకు గుడ్ న్యూస్. వచ్చే ఏడాది ప్రభాస్ నటిస్తున్న రెండు సినిమాలు విడుదలకానున్నాయి. అందులో మొదటగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనెర్ ‘సాహో’. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం యొక్క షూటింగ్ 80శాతం కంప్లీట్ అయ్యింది. భారీ బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయిలో నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.

ఇక ప్రభాస్ ఈ చిత్రం తోపాటు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తన 20వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకులముందుకు రానుంది. పిరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల ఇటలీ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

ఇలా ప్రభాస్ వచ్చే ఏడాది రెండు సినిమాలతో అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నాడు.

సంబంధిత సమాచారం :