సమీక్ష : ‘ది రాజా సాబ్’ – విజువల్ గా గ్రాండ్.. ఎమోషనల్ గా వీక్

సమీక్ష : ‘ది రాజా సాబ్’ – విజువల్ గా గ్రాండ్.. ఎమోషనల్ గా వీక్

Published on Jan 10, 2026 2:02 AM IST

The Raja Saab 5

విడుదల తేదీ : జనవరి 09, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : ప్రభాస్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, సంజయ్ దత్, జరీనా వహబ్, బొమన్ ఇరానీ, సముద్రకని, సత్య, సప్తగిరి, విటివి గణేష్ తదితరులు
దర్శకుడు : మారుతి
నిర్మాణం : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐ వి వై ఎంటర్టైన్మెంట్
సంగీతం : థమన్ ఎస్
ఛాయాగ్రహణం : కార్తిక్ పలాని
కూర్పు : కోటగిరి వెంకటేశ్వరరావు

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రమే ది రాజా సాబ్ (The Raja Saab). దర్శకుడు మారుతి చాలా కాలం నుంచి ప్రభాస్ సైడ్ నుంచి మిస్ అయ్యిన ఒక సాలిడ్ ఎంటర్టైనర్ ని హారర్, ఫాంటసీ ఎలిమెంట్స్ ని జోడించి విడుదల చేసారు. ఇక ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

The Raja Saab Movie కథ:

రాజు (ప్రభాస్) మతిమరుపు సమస్య ఉన్న తన నానమ్మ జానకి దేవి (జరీనా వహబ్) తో కలిసి ఆమెని ప్రాణంగా చూసుకుంటూ ఉంటాడు. అయితే ఒకప్పుడు మహా సంస్థాననికి మకుటం లేని మహారాణికి తన భర్త కనకరాజు (సంజయ్ దత్) అంటే ఎంతో ప్రేమ. అయితే అతని కోసం ఆమె ఎన్నో ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అప్పటి సంస్థాననికి చెందిన నమ్మకస్తుడు గంగరాజు (సముద్రకని) కూడా కనకరాజు కోసం ఇప్పటికీ ఎదురు చూస్తాడు. మరి అసలు ఈ కనకరాజు ఎవరు? అతని కోసం వెళ్లిన రాజా సాబ్ ఏం చేశాడు? తన తాత ఏం చేశాడు? ఎందుకు కనకరాజు తన ఆస్తి పట్ల అంత మమకారం పెంచుకున్నాడు? కనకరాజుని రాజా సాబ్ ఎలా అడ్డుకున్నాడు అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

The Raja Saab ప్లస్ పాయింట్స్:

ఇది డార్లింగ్ హీరో ప్రభాస్ అభిమానులకి ఎంతో కాలం నుంచి మిస్ అవుతున్న వింటేజ్ ట్రీట్ ని అయితే అందిస్తుంది అని చెప్పొచ్చు. ప్రభాస్ వన్ మ్యాన్ షోతో ఈ సినిమాని తన భుజస్కంధాలపై మోసుకొచ్చాడు. తన కామెడీ టైమింగ్, తనపై కొన్ని కామెడీ ట్రాక్ డైలాగ్ లు ఆడియెన్స్ ని మెప్పిస్తాయి. అంతేకాకుండా ప్రభాస్ తన సాలిడ్ పెర్ఫార్మన్స్ తో ఎమోషన్స్ ని బాగా పండించాడు.

తన నానమ్మతో ట్రాక్ లలో మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో అయితే పీక్ పెర్ఫార్మన్స్ ని చూపించి ఆకట్టుకున్నాడు. తనతో పాటుగా ముగ్గురు ముద్దుగుమ్మలు నిధి అగర్వాల్, రిద్ది కుమార్ అలాగే మాళవిక మోహనన్ లు డీసెంట్ స్క్రీన్ స్పేస్ ని దక్కించుకోగా ఈ ముగ్గురితో ప్రభాస్ రొమాంటిక్ అండ్ ఫన్ ట్రాక్ లు ఓ మోస్తరుగా బాగానే అనిపిస్తాయి.

అలాగే ప్రభాస్ నానమ్మ పాత్రలో నటించిన జరీనా వహబ్ మంచి రోల్ లో కనిపించారు. అందులో తగు షేడ్స్ ను బాగా ప్రెజెంట్ చేసారు. ఇక మరో ముఖ్య నటుడు సంజయ్ దత్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ రోల్ అని చెప్పొచ్చు. అందులో తను తన సీనియర్టీతో విలక్షణ నటన చూపించారు. ఇక తనతో పాటుగా సముద్రకని, బొమన్ ఇరానీలు సహాయక పాత్రల్లో బాగా చేశారు. వీరితో పాటుగా ఇతర నటీనటులు అంతా తమ పాత్రల పరిధి మేరకు బాగా చేశారు.

ఇంకా సినిమాలో సెకండాఫ్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. కొంచెం ఎంగేజింగ్ గా కామెడీ, హారర్ విజువల్ ఎలిమెంట్స్ తో నీట్ గా అనిపిస్తుంది. క్లైమాక్స్ పోర్షన్ కూడా మరో బిగ్ ఎసెట్ గా కూడా ఇక్కడ నిలిచింది. ప్రభాస్ ఈ సినిమా ఎందుకు ఎంచుకున్నాడు అనే పాయింట్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ పార్ట్ లో అర్ధం అవుతుంది. కేవలం నటన పరంగానే గానే కాకుండా గ్రాండ్ విజువల్స్ తో భారీ ట్రీట్ మాత్రం క్లైమాక్స్ అదిరే లెవెల్లో కళ్ళ ముందు కనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ అంశం మాత్రం మారుతి రైటింగ్ అని చెప్పక తప్పదు. గత సినిమాల్లో మంచి కామెడీ, హారర్ ఎలిమెంట్స్ ని కూడా బాగా హ్యాండిల్ చేసిన తను ఈ సినిమా ఫస్టాఫ్ నుంచే కథనం వీక్ గా నడిపించారు. ఫస్టాఫ్ లో చాలా వరకు సీన్స్ ఫోర్స్డ్ గా ఇరికించిన భావన చూసే ఆడియెన్స్ లో కలుగుతుంది.

అలాగే చాలా సేపటి తర్వాత కొంచెం కొంచెంగా రాజా సాబ్ ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రాసెస్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. వీటిని ముందుగానే కొంచెం గ్రిప్పింగ్ గా డిజైన్ చేస్తే బాగుండేది. ఇందులో కోర్ పాయింట్ మైండ్ గేమ్ వంటి అంశాలు క్లైమాక్స్ పోర్షన్ కి వచ్చేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపించినా ముందు సన్నివేశాలు దెబ్బతో ఇంత హంగామా అవసరమా అనిపిస్తుంది.

ఇక ఇందులో డార్లింగ్ ఫ్యాన్స్ కోరుకునే కామెడీ, ఎమోషన్స్ లాంటివి ఉన్నాయి కానీ ఆ కటౌట్ కి తగ్గ సరైన ఎలివేషన్ మూమెంట్స్ కూడా లోపించినట్టు అనిపిస్తుంది. వీటిని కూడా మారుతీ బాలన్స్ చేసి ఉంటే బాగుండేది. అలాగే ప్రభాస్ ఓల్డ్ లుక్ కి చెందిన సీక్వెన్స్ మొత్తం లేదు దానికోసం ఎదురు చూసిన వారికి నిరాశ తప్పదు, సో ప్రిపేర్డ్ గా ఉంటే మంచిది. అంతే కాకుండా ఈ సినిమాకి భారీ బడ్జెట్ పెట్టినప్పటికీ ఒక్క క్లైమాక్స్ పోర్షన్ లో తప్ప మిగతా చోట్ల విజువల్ ఎఫెక్ట్స్ తేలికగానే కనిపిస్తాయి.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సాలిడ్ అండ్ గ్రాండ్ సెటప్ తో మంచి ప్రొడక్షన్ డిజైన్ చేసుకున్నారు. అంతే కాకుండా రాజా సాబ్ హౌస్ లో దయ్యాల రూప కల్పనలో ఇంకా అందులోని ఇంటీరియర్ లో మారుతీ సృజనాత్మకత కనిపిస్తుంది. ఇక థమన్ సంగీతం బాగానే ఉన్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో క్లారిటీ మిస్ అయ్యింది. ఎంత మంచి స్పీకర్ సెటప్ లో విన్నా అవి అలానే అనిపిస్తాయి. కార్తీక్ పలాని ఇచ్చిన కెమెరా వర్క్ బాగుంది. మంచి విజువల్స్ ని తను అందించారు. కోటగిరి వెంకటేశ్వరరావు గారి ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు మారుతీ విషయానికి వస్తే.. తను ప్రభాస్ ని బాగా చూపించారు. కానీ ప్రభాస్ నే బాగా ప్రెజెంట్ చేయాలి అని క్రమంలో మిగతా కథనం కొంచెం ఇబ్బందికరంగా నడిపించారు. ఫ్యాన్స్ కి కొంతమేర ఓకే అనిపించవచ్చు కానీ ఇందులో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పోర్షన్ లు తప్ప మిగతా సినిమాలో గట్టిగా గుర్తుంచుకోదగ్గ ఎలిమెంట్స్ అంతగా డిజైన్ చేసుకోలేదు. కానీ ఆర్ట్ పరంగా ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా గ్రాండ్ విజువల్స్ లో తన విజన్ ని మాత్రం అద్భుతంగా ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ ‘ది రాజా సాబ్’ ప్రభాస్ తన వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఎంతో కాలంగా మిస్సవుతున్న డార్లింగ్ ప్రభాస్ కామెడీ, ఎమోషన్స్ అంశాల్లో ఆశ్చరపరుస్తాడు. ఇలా సినిమాని కాపాడే ప్రయత్నం చేశారు. అలాగే అక్కడక్కడా కామెడీ సీన్స్ ఇంకా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పోర్షన్స్ అందులో విజువల్స్ గ్రాండ్ గా అనిపిస్తాయి. కానీ వీక్ ఫస్టాఫ్, కొంచెం ల్యాగ్ అనిపించే కథనంలో ఇందులో బలహీనతలుగా నిలిచాయి. సో తక్కువ అంచనాలు, ఎక్కువ ఓపిక పెట్టుకొని ఈ పండుగ మూమెంట్ లో ఈ చిత్రాన్ని ట్రై చేస్తే మంచిది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు