తమిళనాడు ఫ్యాన్స్ కి ప్రభాస్ సర్ప్రైజింగ్ గిఫ్ట్

Published on Aug 24, 2019 4:14 pm IST

డార్లింగ్ ప్రభాస్ సాహో ప్రచారంలో భాగంగా నేడు చెన్నై వెళ్లారు. అక్కడ మూవీ జర్నలిస్టులతో ఆయన ప్రత్యేకంగా కలవడం జరిగింది. సాహో మూవీ తమిళంలో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఆయన చెన్నై వెళ్లడం జరిగింది. ఆయన చెన్నై మీడియా వర్గాలతో కూడా మాట్లాడే అవకాశం కలదు.

ఐతే ఆసక్తికరంగా ప్రభాస్ తమిళనాడు ఫ్యాన్స్ కి స్పెషల్ సుర్ప్రైజ్ అంటూ ఓ ప్రకటన చేశారు. ఆ సర్పైజ్ కోసం నేడు 8గంటలకి సత్యం సినిమాస్ కి రండి అంటూ పిలుపునిచ్చారు. దీనితో డార్లింగ్ ప్రభాస్ ఇవ్వబోయే ఆ సడన్ సర్ప్రైజ్ ఏమైయుంటుందా అని ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగిపోయింది. ఏమైనా సాహో కొరకు ప్రభాస్ పడుతున్న తపన చూస్తుంటే మెచ్చుకోకుండా ఉండలేం.

సంబంధిత సమాచారం :