మంచు విష్ణు పై ప్రకాష్ రాజ్ మా ఎన్నికల అధికారి కి ఫిర్యాదు!

Published on Oct 5, 2021 2:00 pm IST

టాలీవుడ్ లో మా ఎన్నికల పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది మంచు విష్ణు మరియు ప్రకాష్ రాజ్ లు అధ్యక్ష పదవి కోసం బరిలో దిగడం జరిగింది. ఇప్పటికే ఒకరి పై మరొకరు పలు రకాల విమర్శలు చేయడం జరిగింది. తాజాగా నటుడు ప్రకాశ్ రాజ్ మా ఎన్నికల అధికారికి మంచు విష్ణు పై ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది కాస్త టాలీవుడ్ లో చర్చలకు దారి తీసింది.

60 మందితో పోస్టల్ బ్యాలెట్ లో తమకి అనుకూలం గా మంచు విష్ణు ఓటు వేయించుకున్నారు అంటూ ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేయడం జరిగింది. మంచు విష్ణు పై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే హాట్ టాపిక్ కాగా, ఇప్పుడు ఫిర్యాదు చేయడం పట్ల టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి

సంబంధిత సమాచారం :