పునీత్ రాజ్ కుమార్ పేరిట అప్పు ఎక్స్‌ప్రెస్‌.. విలక్షణ నటుడు పెద్ద మనసు !

Published on Aug 7, 2022 10:30 pm IST

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి నెలలు గడిచిపోతున్నా.. ఆయన అకాల మరణం మాత్రం ప్రేక్షక హృదయాలను ఇంకా కలిచి వేస్తూనే ఉంది. అతి పిన్న వయసులోనే ఆయన మరణించడంతో తోటి సినీ తారలు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో పునీత్ రాజ్ కుమార్ ను ఎప్పటికప్పుడు సినీ ప్రముఖులు తల్చుకుంటూనే ఉన్నారు. విశాల్ లాంటి కొందరు ‘పునీత్ రాజ్ కుమార్’ పేరిట అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.

తాజాగా విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కూడా తనదైన శైలిలో ముందుకు వచ్చారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ జ్ఞాపకార్థం సమాజ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రకాశ్‌ రాజ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అప్పు ఎక్స్‌ప్రెస్‌ పేరుతో అంబులెన్స్‌ సేవలకు నాంది పలికారు. ఇందులో భాగంగా మొదటిగా మైసూరు నగరంలోని మిషన్‌ ఆస్పత్రికి అప్పు ఎక్స్‌ప్రెస్‌ అంబులెన్స్‌ ను ప్రకాశ్‌ రాజ్‌ అందజేయడం జరిగింది. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఒక పోస్ట్ కూడా పెట్టారు.

సంబంధిత సమాచారం :