హీరోలు రాజకీయాల్లోకి రావడంపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !
Published on Nov 12, 2017 4:35 pm IST

తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ అప్పుడప్పుడు తన పదునైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజగా ఆయన సినీ హీరోలు రాజకీయాలు చేయడంపై తన అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. ఈ సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

హీరోలు కేవలం తమకు పాపులారిటీ ఉందని రాజకీయాల్లోకి రాకూడదు. అలా వస్తే అది పెద్ద విపత్తు అవుతుందన్న ఆయన హీరోలు ప్రస్తుతం దేశం ఎదుర్కుంటున్న సమస్యలపై వారికి స్పష్టమైన అవగాహన ఉండాలి, ప్రజల నమ్మకాన్ని వారు గెలుచుకోగలగాలి . మనం కూడా అభిమానుల్లా కాకుండా బాధ్యతగల పౌరుల్లా ఓట్లు వేయాలి అన్నారు. దక్షిణాదిన రజనీ, పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల రాజకీయ ఆరంగేట్రం నైపథ్యంలో ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.

 
Like us on Facebook