మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు తెరకు పరిచయం కానున్న మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని నవంబర్ 14న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నఈ మూవీకి సెన్సార్ నుండి ‘ఏ’ సర్టిఫికేట్ వచ్చింది.
మాకు అందిన సమాచార్మ ప్రకారం ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తాడు. ముఖ్యంగా సేక్నదాఫ్ లో తన పాత్ర పూర్తి హాస్య భరితంగా ఉంటుందని, ప్రేక్షకులను బాగా నవ్విస్తుందని అంటున్నారు. అలాగే సెకండాఫ్ కి ప్రకాష్ రాజ్ పాత్ర హైలైట్ అవుతుందని ఈ చిత్ర టీం అంటోంది. ప్రకాష్ రాజ్ కాకుండా జగపతి బాబు కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపిస్తాడు.
సాయి ధరమ్ తేజ్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ఈ చిత్ర టీం ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు – హర్షిత్ కలిసి నిర్మిస్తున్నారు. ఎ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.


