నిరాశలోంచి పుట్టిన కథే ‘అ!’ !

ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో నాని నిర్మిస్తున్న ‘అ !’ కూడ ఒకటి. నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయంకాబోతున్నాడు. కాజల్ అగర్వాల్, రెజినా, నిత్యామీనన్ వంటి స్టార్ హీరోయిన్లు నటించడం, రవితేజ, నానిలు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఇంతమందికి ఒక్క చోటుకి చేర్చిన ఈ చిత్ర కథ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అందరూ కుతూహలంగా ఉన్నారు.

ఈ సినిమాలో ప్రతి 10 నిమిషాలకు జానర్ మారిపోతుంటుందని హర్రర్, రొమాన్స్, సైన్స్ ఫిక్షన్, కామెడీ ఇలా అన్ని జానర్స్ అందులో ఉంటాయని చెప్పిన దర్శకుడు ప్రశాంత్ వర్మ 2016 డిసెంబర్ 31న 2017 ఆరంభంలో తాను చేయాల్సిన ఒక సినిమా నిర్మాతలు వెనక్కి తగ్గడం వలన ఉన్నట్టుండి ఆగిపోయినట్టు తెలిసి ఆ రాత్రి పార్టీని కూడా క్యాన్సిల్ చేసి ఆ నిరాశలోనే ‘అ !’ రాయడం మొదలుపెట్టానని ఒక ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.