ఓటిటి సమీక్ష: ‘ఫార్మా’ – మలయాళ క్రైమ్ సిరీస్ తెలుగులో జియో హాట్ స్టార్ నుంచి

ఓటిటి సమీక్ష: ‘ఫార్మా’ – మలయాళ క్రైమ్ సిరీస్ తెలుగులో జియో హాట్ స్టార్ నుంచి

Published on Dec 21, 2025 9:18 AM IST

Pharma OTT

విడుదల తేదీ : డిసెంబర్ 19, 2025
స్ట్రీమింగ్ వేదిక : జియో హాట్‌స్టార్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : నివిన్ పౌలే, రజిత్ కపూర్, శృతి రామచంద్రన్, అలేఖ్ కపూర్, నరైన్ తదితరులు
దర్శకత్వం : పి ఆర్ అరుణ్
నిర్మాణం : కృష్ణన్ సేతుకుమార్
సంగీతం : అబ్జాకాస్ ఎస్
సినిమాటోగ్రఫీ : అభినందన్ రామానుజన్
ఎడిటింగ్ : శ్రీజిత్ సారంగ్

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

ఈ వారం ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చిన పలు సిరీస్ లలో మలయాళం ఫేమస్ నటుడు ప్రేమమ్ స్టార్ నివిన్ పౌలే ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ ‘ఫార్మా’ కూడా ఒకటి. మరి మెడికల్ క్రైమ్ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

తన లైఫ్ ని మెడికల్ అండ్ ఫార్మా రంగంలో చిన్న మెడికల్ షాప్ లో పని చేయడం నుంచి మొదలు పెట్టి ఆర్ ఎక్స్ లైఫ్ హెల్త్ కేర్ అనే పాపులర్ హాస్పిటల్స్ లో రిప్రజెంటేటివ్ గా జాయిన్ అవుతాడు కే పి వినోద్ (నివిన్ పౌలే). తన తల్లికి అనారోగ్యం కావడంతో త్వరగా డబ్బు సంపాదించవచ్చు అని కొంచెం కష్టం అయినా అదే ఉద్యోగంలో కస్టపడి పైకి వస్తాడు. కానీ అదే సంస్థలో జరుగుతున్న కొన్ని మెడికల్ క్రైమ్స్ కోసం తాను నెమ్మదిగా తెలుసుకుంటాడు. ఈ క్రమంలో ఆ ఫార్మా వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న జాతి క్లినిక్ హెడ్ లో ఒకరైన రాజీవ్ రావు (రజిత్ కపూర్)తో కలుస్తాడు. అసలు ఆర్ ఎక్స్ హెల్త్ కేర్ వారు ఏం చేశారు? వారి డ్రగ్ కైడాక్సిన్ వల్ల జరిగిన నష్టం ఏంటి? ఈ క్రమంలో వినోద్ ఏం కోల్పోయాడు? చివరికి ఈ మెడికల్ ఫార్మా యుద్ధంలో ఎవరు గెలిచారు అనేది తెలియాలి అంటే ఈ సిరీస్ చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సిరీస్ లో మంచి విషయం ఏదన్నా ఉంది అంటే ఇందులో ఎంచుకున్న నేపథ్యం అనే చెప్పాలి. దర్శకుడు మంచి సామజిక అంశాన్ని ఎంచుకొని ఒక ఓటిటి సిరీస్ గా మలిచి ఆడియెన్స్ కి రీచ్ అయ్యే ప్రయత్నం చేయడం మంచి విషయం. ఈ క్రమంలో కథనం ఇంకా కొన్ని కొన్ని సీన్స్ బాగున్నాయి. అలాగే కొంచెం ఆలోచించేలా కూడా చేస్తాయి.

ఫార్మా రంగంలో ఉండే చిన్న చిన్న ఉద్యోగస్తులు పడే ఇబ్బందులు వంటి వాటిని బాగా చూపించారు. అలాగే మెడికల్ పరంగా జరుగుతున్న కొన్ని డార్క్ కోణాలను కూడా ఇందులో టచ్ చేయడం గమనార్హం. ఇక వీటితో పాటుగా క్లైమాక్స్ పోర్షన్ లో కథనం కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారి వీక్షకునిలో ఆసక్తి పెంచుతుంది.

ఇక నటీనటుల్లో నివిన్ పౌలే తన రోల్ లో డీసెంట్ పెర్ఫామెన్స్ చేశారు. సిరీస్ లో తన రోల్ బిల్డ్ అవుతున్న సమయానికి తగ్గట్టుగా తన నటన అప్డేట్ అవుతూ మంచి పరిపక్వత కలిగిన నటన తాను చూపించాడు. తనతో పాటుగా శృతి రామచంద్రన్, రజిత్ కపూర్ తదితరులు తమ పాత్రల్లో బాగా చేశారు.

మైనస్ పాయింట్స్:

మొత్తం 8 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సిరీస్ ఒకో ఎపిసోడ్ పెద్దగా ఎక్కువ నిడివి కూడా తీసుకోలేదు కానీ.. ఈ టోటల్ సిరీస్ చాలా స్లోగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. స్టార్టింగ్ ఒకటీ రెండు ఎపిసోడ్స్ ఓకే కానీ నెమ్మదిగా మెయిన్ పాయింట్ లోకి వెళ్లినప్పటికీ గ్రిప్పింగ్ కథనం ఇందులో బాగా మిస్ అవుతుంది.

ఈ ఎనిమిది ఎపిసోడ్స్ కూడా అవసరం లేదు 6 లేదా 5 ఎపిసోడ్స్ లోనే పూర్తి చేయగలిగే సిరీస్ ని అనవసరంగా 8 ఎపిసోడ్స్ కి సాగదీశారు. అలాగే ఇలాంటి క్రైమ్ సిరీస్ లకి ఇంపాక్ట్ కలిగించే సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలు, సాలిడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మంచి ట్విస్ట్ లతో కూడిన కథనంని ప్లాన్ చేసుకుంటే చూసే ఆడియెన్స్ లో కూడా మరింత ఉత్సుకత నెలకొంటుంది.

కానీ దీనిని ప్లాన్ చేసుకోలేదు. ఈ మెడికల్ మాఫియా లాంటి నేపథ్యంలో టచ్ చేసిన సినిమాలు సిరీస్ లు తక్కువే కాబట్టి దీనిని ఇంకా బెటర్ గా ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేది. అలానే మన తెలుగు ఆడియెన్స్ ని నివిన్ పౌలే అంటే అప్పుడు ప్రేమమ్ లో చూసిన స్మార్ట్ బాయ్ లానే గుర్తుంటాడు. కానీ ఇందులో కొంచెం బొద్దుగా మారడంతో తనని ఈ పాత్రలో మన వాళ్ళు ఎలా తీసుకుంటారో? అలాగే తెలుగు డబ్బింగ్ కూడా బెటర్ గా ఉండాల్సింది.

సాంకేతిక వర్గం:

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు యావరేజ్ గా ఉన్నాయి. కెమెరా వర్క్ బాగానే ఉంది. కానీ సంగీతం బెటర్ గా ఉండాల్సింది. ఎడిటింగ్ కూడా ఇంకా గ్రిప్పింగ్ గా చేయాల్సింది. స్కిప్ చేసుకోడానికే స్కోప్ ఇచ్చినట్టు కొన్ని సీన్స్ ని అలా వదిలేసారు.

ఇక దర్శకుడు పి ఆర్ అరుణ్ విషయానికి వస్తే.. తన ఆలోచన బాగానే ఉంది. కానీ దీనిని తెరకెక్కించిన తీరు ఇంకా బెటర్ గా ఉండాల్సింది. ఎలానో ఫిక్షనల్ స్టోరీనే కాబట్టి ఇంకా గ్రిప్పింగ్ సీన్స్, మంచి స్కోర్ ని డిజైన్ చేసుకొని ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. సో తన వర్క్ మాత్రం ఇంకా కేర్ తీసుకొని చేయాల్సింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ ‘ఫార్మా’ సిరీస్ లో ఇచ్చిన సోషల్ మెసేజ్, కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి అలాగే నివిన్ కూడా తన రోల్ లో బాగా చేసాడు. కానీ ఈ అంతటికి ఒక ఇంట్రెస్టింగ్ కథనం అవసరం ఉంది. దానిని దర్శకుడు ఇంకాస్త బెటర్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. ఇది పక్కన పెడితే స్లోగా సాగే ఈ సిరీస్ కొంతమేర ఓకే అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు