ఫుల్ బాటిల్ నుండి మెర్క్యూరీ సూరి ప్రిపరేషన్ వీడియో రిలీజ్!

Published on May 25, 2023 9:32 pm IST

టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శరణ్ కొప్పిషెట్టి దర్శకత్వం లో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ ఫుల్ బాటిల్. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ప్రిపరేషన్ వీడియో ను మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో మొత్తం పంచ్ లతో కామెడీ గా సాగింది. డైరెక్టర్ శరణ్, హీరో సత్యదేవ్ కి మెర్క్యూరీ పాత్రను వివరించిన విధానం వీడియో లో ఆకట్టుకుంటుంది.

సత్యదేవ్ మొదటి సారిగా ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ ను చేస్తున్నారు. ప్రిపరేషన్ వీడియో రిలీజ్ కాగా, ఫుల్ బాటిల్ మూవీ కి సంబందించిన టీజర్ ను మే 27 వ తేదీన విడుదల చేయనున్నారు. సంజన ఆనంద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి స్మరన్ సాయి, హరి గౌర లు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :