‘శ్యామ్ సింగ రాయ్’గా నాని !

Published on Feb 24, 2020 5:57 pm IST

మొత్తానికి నాని 27వ సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకి టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ‘శ్యామ్ సింగ రాయ్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను పెట్టారు.

ఇక నాని హీరోగా తెరకెక్కిన వి మూవీ వచ్చే నెల 25న ఉగాది కానుకగా విడుదల కానుంది. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాని సీరియల్ కిల్లర్ రోల్ చేస్తున్నారు. అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే మరో చిత్రంలో నాని నటిస్తున్నారు.

అలాగే ‘అ !’ సినిమాతో నిర్మాతగా మారిన హీరో నాని నిర్మిస్తున్న రెండవ చిత్రం ‘హిట్’. విశ్వక్ సేన్ హీరోగా వస్తోన్న ఈ సినిమా టీజర్, ట్రైలర్లతో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. ఈ థ్రిల్లర్ ఈ నెల 28న విడుదలకానుంది. దీంతో నిర్మాత నాని ప్రమోషన్లు స్టార్ట్ చేశారు.

సంబంధిత సమాచారం :

X
More