పబ్లిసిటీ లేకపోతే ఆ నటి భవిష్యత్ ఏమిటీ..?

Published on Jul 14, 2019 7:28 pm IST

హీరోయిన్ కంగనా రనౌత్ ,మీడియా ప్రతినిధుల మధ్య చెలరేగిన వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఆమెకు వ్యతిరేకంగా జర్నలిస్టులు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. ఈ మేరకు ముంబై ఎంటర్టైన్మెంట్ జర్నలిస్టులు ఆమెను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది చాలదన్నట్టు వారి నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా కంగనా ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామం ఆమె భవిష్యత్తుకు మంచిది కాదనే చెప్పాలి.

ఒక సినిమాకు ప్రేక్షకుడికి మధ్య మీడియా అనేది వారధి లాంటిది. మనం తీసిన సినిమా ప్రేక్షకుడికి చేరాలంటే మీడియా సహకారం అనేది చాలా అవసరం. మనం ఎంత మంచి సినిమా తీసినా ఆవిషయం ప్రేక్షకుడికి తెలిసేలా చేసేది కేవలం మీడియానే. చాలా మంచి సినిమాలు కేవలం సరైన ప్రచారం లేకపోవడం వలన థియేటర్ల నుండి వెళ్ళిపోయిన సందర్భాలు కోకొల్లలు.

మరి ఇలాంటి పరిస్థితులో కంగనా చేసే సినిమాలు ప్రేక్షకులకు చేరడం కష్టమనే చెప్పాలి. ఈ పరిణామం కొనసాగితే కంగనా తో చిత్రాలు తీయడానికి ఏ నిర్మాత సాహసించడు. ఇప్పటికే “జడ్జిమెంటల్ హై క్యా” నిర్మాత ఏక్తా కపూర్, ఈ పరిణామాల వలన అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.కంగనా తరపున స్వయంగా ఆమె క్షమాపణ చెప్పినా జర్నలిస్ట్ లు శాంతించలేదు. కాబట్టి కంగనాకు మీడియాకు మధ్య యుద్ధం వలన మీడియాకు జరిగే నష్టం ఏమి ఉండదు. కానీ కంగనా మాత్రం తెరమరుగయ్యే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇకనైనా కంగనా పట్టువీడి వారితో సంధిచేసుకోవడం మేలు.

సంబంధిత సమాచారం :

X
More