మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ నటుల్లో యువ నటుడు ప్రియదర్శి కూడా ఒకడు. మరి తన నుంచి రీసెంట్ గానే రెండు సినిమాలు వచ్చాయి. మరి ఆ చిత్రాల్లో ఓ ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ కామెడీ చిత్రం “ప్రేమంటే” కూడా ఒకటి. టాలెంటెడ్ బ్యూటీ కయల్ ఆనంది హీరోయిన్ గా దర్శకుడు నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్స్ లో డీసెంట్ రెస్పాన్స్ ని అందుకుంది.
అయితే ఈ సినిమా ఫైనల్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు, సహా ఇతర ముఖ్య దక్షిణాది భాషల్లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది. సో అప్పుడు మిస్ అయ్యినవారు ఉంటే ఇప్పుడు చూడాలనుకుంటే ఇందులో చూడొచ్చు. ఇక ఈ సినిమాకి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు నిర్మాణం వహించగా స్పిరిట్ మీడియా వారి సమర్పణలో ఈ సినిమా వచ్చింది.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


