గోపీచంద్ సినిమాకు రవితేజ నిర్మాత !
Published on Oct 27, 2017 10:02 am IST

మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో గోపీచంద్ ఒకరు, కాని ఈ హీరో చేస్తున్న సినిమాలు ఈ మద్య పెద్దగా ఆకట్టుకోవడం లేదు, త్వరలో గోపీచంద్ కొత్త సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. చక్రి అనే నూతన దర్శకుడితో గోపీచంద్ సినిమా మొదలు కాబోతుందని సమాచారం, ‘బెంగాల్ టైగర్’ సినిమా నిర్మాత రాదా మోహన్ ఈ సినిమాను నిర్మించబోన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈ మద్య హీరో గోపిచంద్ తో కృష్ణవంశి ఒక సినిమా చెయ్యబోతునట్లు వార్తలు వచ్చినా అధికారికంగా ప్రకటన ఎక్కడా రాలేదు, గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘మొగుడు’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గోపీచంద్ తో సినిమా చెయ్యబోతున్న చక్రి గతంలో డైరెక్టర్ బాబి తో కలిసి ‘బలుపు’ అల్లుడు శ్రీను’ జై లవకుశ’ వంటి సినిమాలకు పని చేసారు. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ కు చక్రి హిట్ ఇస్తాడని ఆశిద్దాం.

 
Like us on Facebook