చిరు, సీఎం జగన్ ల మీట్ పై నిర్మాత నట్టి కుమార్ హాట్ హాట్ కామెంట్స్!

చిరు, సీఎం జగన్ ల మీట్ పై నిర్మాత నట్టి కుమార్ హాట్ హాట్ కామెంట్స్!

Published on Aug 17, 2021 10:00 AM IST

natti

ఇప్పుడిప్పుడే మళ్ళీ సినీ పరిశ్రమ ముఖ్యంగా థియేటర్స్ సంస్థ తేరుకుంటుంది. కరోనా రెండో వేవ్ తగ్గి మూడో వేవ్ వచ్చే లోపు థియేటర్స్ తెరుచుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా రన్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం కరోనాకి తోడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా కలకలం రేపింది. సడెన్ జీవో తో సినిమా టికెట్ రేట్లు అమాంతం తగ్గించేయడంతో స్టార్ హీరోల సినిమాలు అయోమయంలో పడ్డాయి.

ఇక దీనితో ఈ ఇష్యూ సహా మరిన్ని ఇతర సమస్యలపై చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవి సహా ఇతర సినీ పెద్దలు ప్రముఖులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పిలుపు మేరకు తాజాగా భేటీ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ మీట్ పైనే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.

చిరంజీవి గారంటే సినీ పరిశ్రమలో తనతో పటు అందరికీ కూడా అపారమైన గౌరవం ఉందని కానీ ఈ మీటింగ్ కు కేవలం పెద్ద నిర్మాతలను మాత్రమే ఆహ్వానించడం ఏమిటని చిన్న నిర్మాతలు కూడా ఉన్నారు కదా వారికి ఎందుకు ఆహ్వానం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేసారు. అలాగే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 35 బాగుందని కానీ అది పూర్తి స్థాయిలో అమలు కాలేదని తెలిపారు.

అయితే పెద్ద సినిమాలకు రేట్లు రెండు వారాల వరకు పెంచుకున్నా పర్వాలేదు కానీ సినిమాలకు 100 రూపాయల గరిష్ట టికెట్ రేటు ఉండడం సబబే అని కానీ బీ, సీ థియేటర్స్ లో మాత్రం దానిని 30 నుంచి 50, 80 రేట్లుగా గా చేయాలని సూచించారు. ఇంకా ఈ రేట్స్ వలనే లేటెస్ట్ గా ‘తిమ్మరుసు’, “ఎస్ ఆర్ కళ్యాణమండపం” చిత్రాలు మంచి వసూళ్లను అందుకున్నాయని తెలిపారు.

అయితే ఏపీ ప్రభుత్వం కరోనా టైం లో థియేటర్స్ కి మూడు నెలల సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చారు కానీ అది ఇంకా నెరవేరలేదని గుర్తు చేశారు. ఇంకా మరిన్ని కీలక విషయాలను కూడా ఆయన చర్చించారు. కొంతమంది థియేటర్స్ వారే సినిమా టికెట్స్ బ్లాక్ లో అమ్ముకుంటున్నారు వీటిపై ఎన్ని సార్లు కంప్లైట్ చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని అందుకే జగన్ గారు జీవో 35 ని స్ట్రిక్ట్ గా అమలు పరచాలని చెప్పారు.

అయితే తెలంగాణాలో సినిమా హబ్ ప్రకటించారు కానీ ఏపీలో పరిస్థితి ఏమిటి అన్నది కూడా క్లారిటీ రావాలని తెలిపారు. అలాగే సినీ ఇండస్ట్రీలో దాసరి గారి తర్వాత చిరంజీవి గారిని అంతలా గౌరవిస్తాం కానీ గతంలో వారు నాగార్జున గార్లతో కలిసి ఏపీ సీఎం తో మీటింగ్ కి వెళ్లారు అప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేరలేదు వాటి విషయంలో వారు ఎంతవరకు అమలు లోకి తీసుకొచ్చేలా చేసారని ప్రశ్నించారు.

ఇక ఫైనల్ గా థియేటర్స్ సిస్టం ని మరింత విచ్ఛిన్నం చేస్తూ వస్తున్న ఓటిటి పై దానిని సపోర్ట్ చేస్తున్న పెద్ద సినిమాల నిర్మాతలపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. థియేటర్స్ ద్వారా తాము స్టార్ ప్రొడ్యూసర్స్ స్థాయికి వచ్చారన్న విషయం గుర్తుంచుకుంటే బాగుంటుంది అని నట్టి కుమార్ తన స్పందనను ఈ మీట్ పై వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు