‘బాహుబలి-3’ పై హింట్ ఇస్తున్న నిర్మాత !

22nd, May 2017 - 01:23:59 PM


రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దినుకున్న ‘బాహుబలి-ది బిగినింగ్’ 2015లో విడుదలైన భారీ విజయాన్ని సాధించగా దానికి సీక్వెల్ గా తెరకెక్కిన ‘బాహుబలి- ది కంక్లూజన్’ చిత్రం ఈ 2017 లో విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సీక్వెల్ నమోదు చేసిన రికార్డులతో దేశవ్యాప్తంగా తెలుగు సినిమా స్టామినా ఏమిటో స్పష్టంగా తెలిసొచ్చింది. ఈ సక్సెస్ తో పాటే ప్రేక్షకుల్లో ఇంకో ప్రశ్న కూడా పుట్టుకొచ్చింది. అదే బాహుబలి-3 ఉంటుందా లేదా అనేది.

మొదట్లో రాజమౌళి మూడవ భాగం ఉండదని అన్నా రెండవ పార్ట్ చివర్లో చిన్న లీడ్ తీసుకోవడం, ఒకవేళ సినిమా తండ్రి విజయేంద్ర ప్రసాద్ మంచి కథ తయారుచేస్తే తప్పకుండా ఉంటుందని చెప్పడంతో మూడవ భాగం ఉండే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం అందరిలోను పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఆ అభిప్రాయానికి మరింత బలం చేకూర్చేలా బాహుబలి ప్రాంచైజీ నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ‘ఒకసారి జరిగింది రెండవసారి జరగదు. కానీ రెండు సార్లు జరిగింది ఖచ్చితంగా మూడవసారి జరుగుతుంది’ అంటూ బాహుబలి సక్సెస్ గురించి ట్వీట్ చేస్తూ 3వ పార్ట్ రూపొందే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయనిస్తో హింట్ ఇచ్చారు. మరి ఈ రాజమౌళి ఆలోచన ఎలా ఉందో చూడాలి.