శర్వానంద్ “మహా సముద్రం” ప్రమోషన్స్ షురూ చేసిన టీమ్!

Published on Sep 19, 2021 6:34 pm IST

శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమన్యూల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మహా సముద్రం. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ చిత్రం అక్టోబర్ 14 వ తేదీన విడుదల కానుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను షురూ చేయడం జరిగింది. సూర్య పేట్ లోని రాజు గారి తోట లో శర్వానంద్ కటౌట్ ను భారీ స్థాయిలో పెట్టడం జరిగింది. శర్వానంద్ సీరియస్ గా ఆయుధం ను పట్టుకున్న ఈ కటౌట్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం చైతన్ భరద్వాజ్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :