పవన్ కళ్యాణ్ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ !
Published on Nov 4, 2017 3:56 pm IST

పవన్ కళ్యాణ్ & త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా పై మంచి హైప్ ఉంది. అనిరుద్ సంగీత దర్శకుడు అవ్వడంతో పాటలు బాగుంటాయని నమ్మకాలు ఉన్నాయి. త్రివిక్రమ్ పుట్టినరోజు సంధర్బంగా నవంబర్ 7 న టైటిల్ అనౌన్స్ చెయ్యనున్నారు చిత్ర యూనిట్. చాలా వరకు ఈ సినిమాకు ‘అజ్ఞాతవాసి’ టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

తాజా సమాచారం మేరకు నవంబర్ 7 న టైటిల్ తో పాటు సినిమాలో ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చెయ్యనున్నారు. ఈ విషయం అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. అను ఎమ్మానుల్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.పవన్ కళ్యాణ్ నటిస్తోన్న 25 వ సినిమా ఇదే అవ్వడం విశేషం.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook