పురాణపండ ‘హరోంహర’ ను నగరిలో పంచిన ‘ రోజా’

పురాణపండ ‘హరోంహర’ ను నగరిలో పంచిన ‘ రోజా’

Published on Nov 13, 2019 10:04 AM IST

puranapanda srinivas book ' harom hara' presented by r.k.roja mla

నగరి : నవంబర్: 13

భారతీయ సనాతన ధర్మంలోని ఉపాసనా రూపాలైన దివ్య మంత్రశక్తుల్ని అక్షరబద్ధం చేసి అద్భుత గ్రంథాలుగా అందించడంలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తెలుగునాట నిస్సందేహంగా తొలివరుసలో వున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భగా నగరి ఎమ్మెల్యే శ్రీమతి రోజా నగరి శివాలయంతో పాటు హైదరాబాద్, విజయవాడ, తిరుపతి ఆలయాలలో అందజేసిన వేలాది శివభక్తి గ్రంథాలు పవిత్ర సంచలనం సృష్టించడం వెనుక ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ మహోన్నతమైన నిస్వార్ధ యజ్ఞభావన వుంది. కార్తీక పౌర్ణమి పవిత్ర పర్వదినం సందర్భంగా పురాణపండ శ్రీనివాస్ అపురూప శివ తేజస్సుగా రచించి సంకలనం చేసిన గ్రంధం పేరు’ హరోం హర’ . ఈ హరోంహర గ్రంధానికి నగరి ఎమ్మెల్యే , వైఎస్ఆర్ సిపి రాష్ట్ర నాయకురాలు ఆర్కే రోజా సమర్పకురాలు కావడం గమనార్హం.

కాశీ క్షేత్రం , శ్రీశైలం , శ్రీకాళహస్తి, అరుణాచలం, ద్రాక్షారామం వంటి పరమ శైవ క్షేత్రాలలో ఆగమ శాస్త్రం ప్రకారం చేసే శివ మంత్రాల సమూహాన్ని ఈ హరోంహర గ్రంధంగా శ్రీమతి రోజా ప్రచురించారు. ఈ మహా మహిమాన్విత గ్రంధాన్ని ఎవ్వరైనా హాయిగా పారాయణం చేసుకునేలా ఈ హరోంహర ను
ధ్వనింపచేశారు రచయిత పురాణపండ శ్రీనివాస్. ఈ గ్రంధాన్ని చదివితే చాలు … స్వయంభూ లింగాన్ని దర్శించినంత ఫలితం కలుగుతుందనే మంచి ఉద్దేశంతో ఈ చక్కని చిన్న గ్రంధాన్ని నూట ముప్పై నాల్గు పేజీలతో ప్రచురించారు రోజా. ముఖపత్రం కూడా చాలా సౌందర్యంగా ఉందంటున్నారు
విజ్ఞులు. గతంలో పురాణపండ శ్రీనివాస్ తో శ్రీపూర్ణిమ వంటి మహోన్నత గ్రంధం ప్రచురించి, రాష్ట్రంలో పండిత మేధావి వర్గం ప్రశంసలు పొందిన ఆర్కే రోజా మళ్ళీ ఈ కార్తీకంలో అందించిన హరోంహర పుస్తకం వేలకొలది ప్రతులు భక్తుల్ని ప్రవేశింప చేస్తున్నాయి.

నగరి చరిత్రలో ఎవరూ ఇలాంటి ధార్మిక కార్యం చెయ్యలేదని ఆలయాల ప్రతినిధులు, అర్చక వర్గాలు, ధార్మిక సంస్థల ప్రతినిధులు రోజా పై ప్రశంసలు జల్లులు కురిపిస్తున్నారు. రోజా పెట్టిన ఈ కార్తీక మంత్రం దీపం గ్రంధం రెండు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ పుస్తక సౌందర్యం, భాషాశైలి, ప్రచురణా విలక్షణత , నిస్వార్ధ సేవ , వ్యాఖ్యాన వైఖరీదక్షత గురించి వేరే చెప్పఖ్ఖర్లేదు. అది ఎప్పుడూ పారిజాతమే. మారేడుదళమే. సమ్మోహనమే. మొత్తంమీద రోజా ‘ హరోం హర’ తో నగరిని మారు మ్రోగించింది. ఈ బుక్ కోసం భక్తులు పోటెత్తారు. ఒక దశలో బుక్స్ అయిపోయి , హరోంహర పంచుతున్న కార్యకర్తలు వెనుతిరిగారేకానీ భక్తుల ప్రవాహం మాత్రం ఆగలేదు.

puranapanda srinivas book ' harom hara' presented by roja at manakonda sivalayam on kaarthika pournami

Puranapanda Srinivas
Puranapanda Srinivas

puranapanda srinivas book ' harom hara' gift by roja at nagari sivalayam on kaarthika pournami

puranapanda srinivas book ' harom hara' presented by roja at manakonda sivalayam on kaarthika pournami

puranapanda srinivas book ' harom hara' presented by roja at manakonda sivalayam on kaarthika pournami

puranapanda srinivas book ' harom hara' presented by roja at manakonda sivalayam on karthika pournami

puranapanda srinivas book ' harom hara' presented by roja at manakonda sivalayam on kaarthika pournami

సంబంధిత సమాచారం

తాజా వార్తలు