2020వ సంవత్సరం మానవ జీవితాలను ఎలా తలకిందులు చేసిందో అందరికీ అనుభవమే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎన్నో ప్రాణాలు పోయాయి. ఎంతో మంది జీవితాలు కుంటుబడ్డాయి. మానవాళి మొత్తం చిగురుటాకులా వణికిపోయింది. అందుకే 2020ను చాలామంది అన్ లక్కీ ఇయర్ అన్నారు. 2020 త్వరగా వెళ్ళిపోయి కొత్త ఏడాది వస్తే బాగుండని ఆశించారు. అందుకే 2021 కొత్త ఏడాదిని ఎన్నో ఆశలతో ఆహ్వానించారు. కానీ కొందరు మాత్రం భిన్నమైన కోణంలో చూస్తూ 2020 చాలా మంచి సంవత్సరం అంటున్నారు. వారిలో టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడ ఒకరు.
అందరూ 2020ని తిట్టుకుంటున్నారు. కానీ మన లైఫ్లో బెస్ట్ ఇయర్ మాత్రం 2020. ఇది మనకు చాలా నేర్పింది. హెల్త్ ఎంత ఇంపార్టెంటో అందరికీ అర్థమైంది. ఇమ్యూనిటీ ఎంత అవసరమో తెలిసింది. మంచి ఆహారం యొక్క విలువ తెలిసింది. శుభ్రత నేర్చుకున్నాం. పుట్టిన తర్వాత ఇన్ని సార్లు ఎప్పుడూ మనం హ్యాండ్ వాష్ చేసుకోలేదు. పల్లెటూళ్లలో చదువుకోని వారికి కూడా చాలా విషయాలు తెలిశాయి. వైరస్, న్యూట్రేషన్, శానిటైజర్, క్వారంటైన్, యాంటీ బాడీస్, ప్లాస్మా, స్ట్రెయిన్ ఇలా ఎన్నో విషయాలు తెలిసిపోయాయి. ఖాళీగా ఇంట్లో కూర్చోవాలి అంటే మెంటల్ హెల్త్ అవసరమని తెల్సింది.
మనలో ఓర్పు బాగా పెరిగింది. ఆత్మనిర్భార్.. ఆ తర్వాత మెల్లగా కామ్ అయ్యాం. డబ్బు లేకుండా ఈ నెలలు ఎలా బ్రతికామో కూడ తేలీదు. స్నేహితులెవరో తెలిసింది. సేవింగ్స్ ఎంత ముఖ్యమో తెలిసింది. నేచర్ చాలా పవర్ఫుల్ అని, ఏ దేవుడూ మనల్ని కాపాడలేడని తెలిసింది. పాస్ట్ మనది కాదు, ఫ్యూచర్ మనది కాదు. ఈరోజును సెలబ్రేట్ చేసుకుందాం. లివింగ్, వర్కింగ్, లాఫింగ్, డ్యాన్సింగ్ చేద్దాం. రోజూ కాసేపు వ్యాయామం చేద్దాం. పవర్, వాటర్, ఫుడ్ వేస్ట్ చేయవద్దు. ప్రకృతిని పలకరిద్దాం. బ్రతికిన ప్రతిరోజునూ సెలబ్రేట్ చేసుకుందాం అంటూ మొత్తంగా 2021లో ఒళ్ళు దగ్గరపెట్టుకుని నడుచుకుందామని సలహా ఇచ్చారాయన.


