మహేష్ బాబుకి స్క్రిప్ట్ సిద్ధంచేసిన పూరి

mahesh_puri
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. టెంపర్ విజయంతో మంచి ఊపు మీద వున్న పూరి మెగాస్టార్ 150వ సినిమా అవకాశం దక్కడంతో రాత్రికి రాత్రి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా వున్నాడు. పూరి తాజాగా తెరకెక్కించిన ‘జ్యోతిలక్ష్మి’ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీని కేవలం 60రోజులలోనే షూటింగ్ పూర్తిచేశాడు.

ఇదే ఊపులో మహేష్ బాబుతో కూడా ఒక స్క్రిప్ట్ ని ఖరారు చేసినట్టు తెలుస్తుంది. చిరంజీవితో తెరకెక్కించనున్న చిత్రం పూర్తికాగానే ఈ సినిమా పట్టాలేక్కుతుందని సమాచారం. ఈ విషయాన్ని పూరినే స్వయంగా ధృవీకరించారు. ఈ ప్రాజెక్ట్ మహేష్ -పూరిల కాంబినేషన్ లో మూడవ చిత్రంగా నిలవనుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన పోకిరి 75 సంవత్సరాల టాలీవుడ్ రికార్డులన్నీ చెరిపేసింది. ఆ తరువాత వచ్చిన బిజినెస్ మెన్ కూడా మంచి కలెక్షన్లను అందుకుంది. మరి వీరికాంబినేషన్ హ్యాట్ ట్రిక్ ఇస్తుందో లేదో చూడాలి.