పూరి జగన్నాధ్ విడుదల చెయ్యనున్న 47 డేస్ మొదటిపాట !
Published on Feb 13, 2018 9:48 pm IST

టైటిల్ కార్డ్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ’47 డేస్’.. ‘ది మిస్టరీ అన్ ఫోల్డ్స్’ అనేది ట్యాగ్ లైన్. జ్యోతి లక్ష్మి సినిమాలో నటించిన సత్యదేవ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రదీప్ మద్దాలిన ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకేక్కబోతోంది.

హరితేజ, రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్,ఇర్ఫాన్, బేబి అక్షర, ముక్తార్ ఖాన్, సత్య ప్రకాష్, కిరీటి, అశోక్ కుమార్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియన్స్ కు డిఫరెంట్ ఎక్ష్పిరియన్స్ ఎవ్వబోతుందని సమాచారం. రేపు ఈ సినిమాలో మొదటి పాటను డైరెక్టర్ పూరి జగన్నాధ్ విడుదల చెయ్యబోతున్నాడు. రేపు సాయంత్రం 5 గంటలకు ఈ సాంగ్ (క్యా కరోన్) సోషల్ మీడియాలో అందుబాటులో ఉండబోతోంది.

 
Like us on Facebook