డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన తనయుడు ఆకాష్ ను హీరోగా పరిచయం చేస్తూ తీసిన చిత్రం ‘మెహబూబా’. వరుస పరాజయాలతో సతమవుతున్న పూరికి ఈ చిత్రం కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ఇప్పుడు తన తర్వాతి చిత్రాన్ని కూడా ఆయన కుమారుడితోనే చేయనున్నారు.
ఈ చిత్రానికి సంభంధించిన స్క్రిప్ట్ ను కూడా రెడీ చేశాడట. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం. ఇక మొదటి చిత్రం ‘మెహబూబా’తో ఆకాష్ కు నటన పరంగా మంచి మార్కులే పడ్డాయి. మరి చాలా కాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తున్న పూరికి ఈ చిత్రమైన విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.


