పూరి రాసిన ప్రేమకథ ‘రోమియో’ రిలీజ్ డేట్

romeo
సాయిరాం శంకర్ హీరోగా నటించిన సినిమా ‘రోమియో’. ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితం పూర్తయినప్పటికీ పలు కారణాల వల్ల రిలీజ్ ఆలస్యమవుతోంది. కానీ ఎట్టకేలకు ఈ సినిమాని బయటకు తీసుకు వచ్చి రిలీజ్ చెయ్యడానికి మధుర శ్రీధర్ ముందుకు వచ్చాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాని అక్టోబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మధుర శ్రీధర్ తెలిపాడు. అలాగే మాట్లాడుతూ ‘ఫుల్ ఫన్ ఉంటూ సాగే మ్యూజికల్ లవ్ స్టొరీ ఇది. సినిమా బాగా నచ్చింది అందుకే అన్ని ఏరియాల్లోనో కొన్నానని’ అన్నాడు.

పూరి జగన్నాధ్ మాట్లాడుతూ ‘నేను చాలా ఇష్టపడి రాసుకున్న ప్రేమకథ. నా దగ్గర చాలా సినిమాలకు పనిచేసిన గోపి గణేష్ కి బహుమతిగా ఈ రోమియో కథని ఇచ్చానని’ అన్నాడు. ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. సాయిరాం శంకర్ సరసన అడోనిక హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాకి పూరి జగన్నాథ్ కథ- మాటలు అందించాడు. అందుకే ఈ సినిమాకి ‘పూరి రాసిన ప్రేమకథ’ అని ఉపశీర్షిక పెట్టారు. ఇండియన్ కుర్రాడికి, అమెరికా అమ్మాయికి మధ్య జేరిగే ‘రోమియో’ ప్రేమకథకి సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు. ఎక్కువ భాగం యూరప్ లో షూట్ చేసిన ఈ సినిమాని వల్లూరిపల్లి రమేష్ నిర్మించాడు.