బిగ్ స్క్రీన్స్ పై “పుష్ప 2” టీజర్ గట్టి ట్రీట్.!

బిగ్ స్క్రీన్స్ పై “పుష్ప 2” టీజర్ గట్టి ట్రీట్.!

Published on Apr 19, 2024 2:00 PM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” (Pushpa 2 The Rule) కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా అనుకున్నట్టుగానే ఈ చిత్రం భారీ మొత్తంలో బిజినెస్ ని పుష్ప 2 వరల్డ్ వైడ్ గా జరుపుకుంటుంది.

అయితే ఈ చిత్రం తాలూకా టీజర్ (Pushpa 2 Teaser) ని మేకర్స్ రీసెంట్ గా అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేశారు. అయితే ఆన్లైన్ లోనే మేకర్స్ ఈ టీజర్ ని రిలీజ్ చేయగా దీనికి ఫుల్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఏమి రాలేదు. మెయిన్ గా టీజర్ అని చెప్పి కేవలం బన్నీనే చూపించడంతో కొందరు బాగా డిజప్పాయింట్ అయ్యారు. కానీ ఈ కాన్సెప్ట్ ని పక్కన పెడితే ఈ టీజర్ బిగ్ స్క్రీన్స్ పై మాత్రం పగిలిపోయింది అని చెప్పాలి.

రీసెంట్ గానే మేకర్స్ పలు థియేటర్స్ లో అటాచ్ చేస్తున్నట్టుగా తెలిపారు. అయితే బిగ్ స్క్రీన్స్ పై మాత్రం ఈ టీజర్ సర్ప్రైజ్ చేసింది. చూసేందుకు వెండితెరపై పుష్ప 2 టీజర్ అద్భుతంగా ఉండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు దీనికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దీనికి వస్తుంది. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఆగస్ట్ 15 న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు