కొనసాగుతున్న పుష్ప భీభత్సం…30 మిలియన్ వ్యూస్ సాధించిన ఫస్ట్ సింగిల్!

Published on Aug 18, 2021 4:15 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం లో అల్లు అర్జున్ మునుపెన్నడూ లేని విధంగా మాస్ పాత్ర లో నటిస్తున్నారు. పుష్ప ది రైస్ మొదటి పార్ట్ ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయడం జరిగింది.

ఈ చిత్రం నుండి ఇటీవల దాక్కో దాక్కో మేక అనే పాట విడుదల అయిన సంగతి తెలిసిందే. అయిదు భాషల్లో విడుదల అయిన ఈ పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ పాట ఇప్పటి వరకూ ఐదు బాషల్లో కలిపి 30 మిలియన్ ప్లస్ వ్యూస్ సాధించింది. వైల్డెస్ట్ సాంగ్ గా దాక్కో దాక్కో మేక పాట ఉందని సినీ క్రిటిక్స్ సైతం చెప్పుకొస్తున్నారు. ఈ చిత్రం లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ముత్తం శెట్టి మీడియా తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

పాటను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :