సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్ప “ఫస్ట్ సింగిల్”

Published on Sep 6, 2021 3:00 pm IST


అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం పుష్ప ది రైస్ పేరిట ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన పోస్టర్లు, టీజర్ సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రం నుండి ఇటీవల ఫస్ట్ సింగిల్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల కానుంది. ఐదు బాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ఐదు బాషల్లో విడుదల చేయడం జరిగింది. దాక్కో దాక్కో మేక అంటూ విడుదల ఈ పాట తెలుగు నాట సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ పాట వన్ మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా, ఇప్పటి వరకు కూడా తెలుగు లో 35 మిలియన్ వ్యూస్ ను సాధించడం జరిగింది.

ఈ చిత్రం నుండి విడుదల అయిన తొలి పాట సెన్సేషన్ క్రియేట్ చేయడం తో సినిమా ఎలా ఉంటుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో విలక్షణ నటుడు ఫాహద్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక మందన్న నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :