గ్లోబల్ గా “పుష్ప” క్రేజ్..జగ్గూభాయ్ చిత్ర యూనిట్ కి ప్రశంసలు..!

Published on Feb 19, 2022 7:21 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “పుష్ప ద రైజ్” కోసం అందరికీ తెలిసిందే. మన టాలీవుడ్ మోస్ట్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంతో బన్నీ భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ పరంగా మరియు తన నటన పరంగా కూడా అందుకున్నాడు. ఇక ఇదిలావుండగా ఈ సినిమాలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఏ స్థాయిలో హిట్ అయ్యాయో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎంత రీచ్ కి వెళ్ళాయో కూడా చూసాము.

ఇక ఇప్పుడు ప్రముఖ సీనియర్ నటుడు జగపతిబాబు ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది. ఇందులో ప్రపంచ ప్రఖ్యాత యానిమేషన్ క్యారెక్టర్ అయినటువంటి “కంగ్ ఫు పాండా” పుష్ప లోని ఐకానిక్ స్టెప్ అయినటువంటి శ్రీవల్లి వేయడం జరిగింది. అయితే ఇది నేను దుబాయ్ లో చూశానని, ఇలా మన తెలుగు సినిమా గ్లోబల్ గా రీచ్ తెచ్చుకోవడం చాలా గర్వంగా ఉందని పుష్ప యూనిట్ దర్శకుడు సుకుమార్ హీరో అల్లు అర్జున్ మరియు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ లకు స్పెషల్ థాంక్స్ తెలియజేసారు..

సంబంధిత సమాచారం :