“పుష్ప” మ్యానియా.. తెలుగు స్టేట్స్ లో నాలుగో రోజు స్ట్రాంగ్ వసూళ్లు!

Published on Dec 21, 2021 3:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్న హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా “పుష్ప ది రైజ్” రిలీజ్ రోజు నుంచి మంచి వసూళ్లు అందుకుంటూ కొనసాగుతుంది. ఈ ఏడాది క్రిస్మస్ పండుగను కాస్త ముందే స్టార్ట్ చేసి అదరగొట్టిన పుష్ప మొదటి మూడు రోజులు రికార్డు నెంబర్ వసూళ్లను అందుకుంది. ఇక అత్యంత కీలకమైనటువంటి వర్కింగ్ డే నాలుగో రోజు కూడా సాలిడ్ వసూళ్లు అందుకొని పుష్ప ఆశ్చర్యపరిచింది.

ఈ నాలుగో రోజు గాను తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 7 కోట్ల మేర షేర్ ని అందుకొని స్ట్రాంగ్ గా నిలిచింది. మరి కీలక ఏరియాల వారీగా చూస్తే నైజాం లో ఈ చిత్రం 3.45 కోట్లు వసూలు చెయ్యగా ఆంధ్ర లో 2.5 కోట్లు అలాగే సీడెడ్ లో 1 కోటి రూపాయల షేర్ ని అందుకొని టోటల్ గా 7 కోట్ల రూపాయలను నాలగవ రోజున కొల్లగొట్టింది.

దీనితో లాంగ్ రన్ లో పుష్ప డెఫినెట్ గా మంచి మార్క్ సెట్ చెయ్యడం గ్యారెంటీ అని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :