తెలుగు రాష్ట్రాల్లో ఐదవ రోజు “పుష్ప” కలెక్షన్స్

Published on Dec 22, 2021 3:01 pm IST

పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద సిసలైన మాస్ విశ్వరూపం చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సందడి కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా సంయుక్తం గా నిర్మించిన ఈ చిత్రం లో హీరోయిన్ గా రష్మీక నటించడం జరిగింది.

తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదవ రోజు మొత్తం 4.5 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. నైజాం లో 2.15 కోట్ల రూపాయలు, సీడెడ్ లో 0.68 కోట్ల రూపాయలు, ఆంధ్ర లో 1.6 కోట్ల రూపాయలను వసూలు చేసింది. వర్కింగ్ డేస్ లో సైతం పుష్ప చిత్రం గట్టి హోల్డ్ ను కనబరుస్తోంది. ఈ చిత్రం లాంగ్ రన్ లో ఏ తరహా వసూళ్ళను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :