కాస్త కన్ఫ్యూజన్ లో “పుష్ప” ఓటిటి రిలీజ్..?

Published on Jan 4, 2022 5:40 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “పుష్ప” వారి కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మరి ఇప్పటికీ కూడా థియేటర్స్ లో సాలిడ్ రన్ కనబరుస్తుంది. డీసెంట్ హోల్డ్ లో థియేటర్స్ తో ఈ సినిమా కొనసాగుతుండగా మరోపక్క ఈ సినిమా ఓటిటి రిలీజ్ పట్ల ఆసక్తికర టాక్ వైరల్ అవుతుంది.

మరి ఈ టాక్ ప్రకారం అయితే వచ్చే జనవరి 7 నే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వస్తుంది అని కన్ఫర్మ్ అయ్యింది. కానీ ఇంకో పక్క ఇప్పుడు మరో వైరల్ అవుతుంది. మేకర్స్ ఈ ఎర్లీ స్ట్రీమింగ్ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నారట. ఈ సినిమా ప్రస్తుతాని ఇంకా థియేటర్స్ లో బాగానే ఆడుతుంది పైగా సంక్రాంతికి కూడా ఇతర పెద్ద సినిమాలు లేనందున ఇంకో ఒకటి లేదా రెండు వారాల తర్వాత స్ట్రీమింగ్ కి తీసుకురావాలని చూస్తున్నారట. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :