“ఎఫ్ 3” సెట్స్ లో “పుష్ప” రాజ్ సడెన్ సర్ప్రైజ్.!

Published on Oct 6, 2021 12:00 pm IST

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉన్న పలు క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు చేస్తున్న సినిమా “ఎఫ్ 3” కూడా ఒకటి. వరుస హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా కంప్లీట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా సెట్స్ లోకి పుష్ప రాజ్ సడెన్ విజిట్ ఇవ్వడం సర్ప్రైజింగ్ గా అనిపించింది.

షూటింగ్ స్పాట్ లో ఉన్నటువంటి స్టార్ హీరో వెంకటేష్ వరుణ్ తేజ్ సహా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ లతో అల్లు అర్జున్ ముచ్చటించాడు. అలాగే దర్శకుడు అనీల్ రావిపూడి సునీల్ తో బన్నీ మాట్లాడ్డం జరిగింది. దీనితో ఈ ఫొటోలే ఇపుడు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :