వైరల్..హిందీలో “పుష్ప” అన్ బీటబుల్ క్రేజ్ కంటిన్యూ..!

Published on Jun 29, 2022 2:06 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ హిట్ సినిమా “పుష్ప”. మరి అల్లు అర్జున్ కెరీర్ లో ఒక సెన్సేషనల్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ రీచ్ ని అందుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ సహా నార్త్ ఆడియెన్స్ లో అయితే ఇంకా సినిమా హవా కొనసాగిస్తోంది.

లేటెస్ట్ గా అయితే బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ చేసిన ఒక అడ్వర్టైజ్మెంట్ లో కూడా పుష్ప రిఫరెన్స్ కనిపించడంతో హిందీలో మాత్రం పుష్ప మాస్ క్రేజ్ అన్ బీటబుల్ గా ఉందని చెప్పాల్సిందే. ప్రస్తుతం అయితే ఈ వీడియో మంచి వైరల్ గా మారింది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంకి సీక్వెల్ ని మరికొన్నాళ్లలో పట్టాలెక్కించనుండగా దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :