పుష్ప: సమంత స్పెషల్ సాంగ్ అప్పటినుంచేనా?

Published on Nov 21, 2021 3:02 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “పుష్ప”. పాన్‌ ఇండియన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌నున్నారు. మొదటి భాగం “పుష్ప ది రైజ్” పేరుతో డిసెంబర్ 17 వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో సమంత మెరవబోతుంది.

అయితే ఈ పాట కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదు రు చూస్తున్నారు. అయితే ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ పాటను నవంబర్ 28 నుంచి చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ పాట కోసం సామ్ ఇప్పటికే డ్యాన్స్ రిహార్సల్స్ ప్రారంభించిందని టాక్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More