కాస్త టెన్షన్ లో “పుష్ప” యూనిట్.?

Published on Dec 15, 2021 9:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిచిన భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప ది రైజ్”. అల్లు అర్జున్ మరియు సుకుమార్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన ఈ భారీ చిత్రం ఇంకో రెండు రోజుల్లో రిలీజ్ కి రెడీగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా సాలిడ్ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని దగ్గరుండి దర్శకుడు సుకుమార్ ప్రిపేర్ చేస్తున్నారు.

ఆ పనుల్లోనే మొన్న ప్రీ రిలీజ్ వేడుకకి కూడా హాజరు కాలేక పోయారు. అయితే కంటెంట్ పరంగా చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్న మేకర్స్ కి ఇప్పుడు ఇంకా టెన్షన్ లో ఉన్నారట. ఇంకా యూఎస్ ప్రీమియర్స్ కి సంబంధించి ఫస్ట్ కాపీ రెడీ కాలేదని తెలుస్తుంది. అయితే అది బహుశా ఈరోజుకి పూర్తయ్యి వెళ్ళిపోతుందని టాక్. లాస్ట్ మినిట్ లో ఇలాంటి టెన్షన్స్ అయితే సుకుమార్ సినిమాలకి కొత్తేమి కాదు. కాకపోతే ఇలాంటి సంకేతాలు అభిమానులను కాస్త ఆందోళనకి గురి చేస్తాయి.

సంబంధిత సమాచారం :