“పుష్ప” రిలీజ్ ఈ రేస్ లోకి వెళ్లిందా.?

Published on May 1, 2021 11:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప” దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియన్ చిత్రంపై భారీ అంచనాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఆగష్టు లోనే విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. కానీ మళ్ళీ కరోనా వల్ల పరిస్థితులు మారిపోవడంతో చాలా సినిమాల లానే ఈ చిత్రం కూడా పడుతుందని టాక్ స్టార్ట్ అయ్యింది.

అలా పుష్ప డిసెంబర్ కి షిఫ్ట్ అయ్యిందని తెలిసింది. కానీ లేటెస్ట్ టాక్ ఏంటంటే ఇప్పుడు షిఫ్ట్ అయిన సినిమాలు ఆగష్టు కనుక టార్గెట్ చేసుకుని రిలీజ్ చేస్తే పుష్ప దసరా రేస్ లో నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్. మరి అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :